![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటా డాన్స్ షోకి ట్రోఫీ ఇవ్వడానికి సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్నో విషయాలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేసుకున్నారు. "నీహారిక గారి గురించి మా అందరికీ తెలియని విషయం ఏదైనా " అని సుధీర్ అడిగాడు. "నీహారిక , వైష్ణవ క్లాస్మేట్స్. స్కూల్ అంతా షేక్ ఐపోయేది. నిహారిక వస్తుంటే చదువుల తల్లి వస్తున్నట్టు ఫీలయ్యేవాళ్ళం మేము. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. "అన్నాడు.
"ఎందుకంటే వైష్ణవ కంటే నేను బెటర్ గా చదివేదాన్ని కాబట్టి" అంది నిహారిక. "ఎంత బాగా చదివేది అంటే టెక్స్ట్ బుక్ ని అలానే దింపేసేది" అన్నాడు సాయి ధరమ్ తేజ్. "ఇదేంటో నాకు ఎక్కడో కొడతాంది" అని సుధీర్ అనేసరికి "నెక్స్ట్ నేను కొడతా" అన్నాడు తేజ్. "అలాగే దింపేసేది "అంటే అని సుధీర్ అనేసరికి "చిట్టీలు రాసేటప్పుడు అలాగే ఉంటదిగా మరి " అన్నాడు తేజ్. "బావా నేను లైఫ్ లో చేయనిది చిట్టీలు పెట్టడం " అంది "మేము మాట్లాడుకుంటాం అని సుధీర్ అనేసరికి నా పరువు తీసే పని చేయకు అని నిహారిక వార్ నింగ్ ఇచ్చింది. వెంటనే తేజ్ "తల్లీ ఎం చేయొద్దు ఈ ఎపిసోడ్ డబ్బులు కట్ చేద్దాం" అని తేజ్ తిరిగి సుధీర్ మీద కౌంటర్ వేసాడు. "మీరు రావడం వలన మాకు చాల విషయాలు తెలిసాయి" అన్నాడు సుధీర్. "ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆడుకున్నా అందుకే ఇప్పుడు నన్ను ఇలా " అని నిహారిక అనేసరికి "సుధీర్ తెలుసుగా .
సుప్రీమ్ సినిమాలో యాక్షన్ కూడా ఉంటది తెలుసుగా " అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తేజ్. "నాకు వైష్ణవ్ ని తేజ్ ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు అన్ని చోట్లకు కలిసే వెళ్తారు. ఇద్దరికీ ఫ్రెండ్స్ కూడా సేమ్ గా ఉంటారు. నేను మా వరుణ్ అన్నతో అనేదాన్ని వైష్ణవ చిన్నోడైనా తేజ్ బావ చక్కగా అన్ని చోట్లకు తీసుకెళ్తాడు నువ్వెందుకు నన్ను తీసుకెళ్ళవు నేను బావ దగ్గరకు వెళ్ళిపోతా బావైతే నన్ను కూడా తీసుకెళ్తాడు. ఇలాంటి బ్రదర్స్ ని నేనెక్కడా చూడలేదు " అని చెప్పింది నిహారిక.
![]() |